జనగామ: గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ శిక్షణ క్యాంపు మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సత్యనారాయణరెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ ప్రీతి దయాల్, కాసాల సంతోష్ కుమార్, గుడాల ఫ్యామిలీ ఫౌండే షన్ డైరెక్టర్ రాము, చెస్‌కోచ్‌లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు నిర్వహించిన చెస్ క్యాంపులో 120 మంది విద్యార్థులు పాల్గొని చెస్‌కు సంబంధించిన మౌలిక నైపుణ్యాలు, వ్యూహాలు నేర్చుకున్నారు. కార్యక్రమం చివరి రోజు పది మందికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే క్యాంపులో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, కో–చైర్మన్లు గుడాల వేణు, గుడాల శ్రీధర్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.


