మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

జనగామ రూరల్‌: విద్యార్థులు మత్త పదార్థాలకు దూరంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ అన్నారు. బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పెంబర్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాలలో శ్రీబాలల భద్రత– మత్తు పదార్థాలకు నో చెప్పండిశ్రీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఏహెచ్‌టీయూ, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్తుపదార్థాలు భవిష్యత్‌ను నాశనం చేస్తాయని వివరించారు. సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, అనుహ్య లింకులు, ఫేక్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత బాధ్యతాయుత పౌరులుగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సైబర్‌ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించి సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement