జనగామ రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు డీఐఈఓ కె.జి తేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీఐఈఓ ఆధ్వర్యంలో సోమవారం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్‌మెంట్ అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కేంద్రంలో 5 సెంటర్లు ఉన్నాయని, నర్మెటలో 1, స్టేషన్ ఘన్‌పూర్‌లో 2, జఫర్‌గఢ్‌లో 1 కొడకండ్లలో 1, దేవరుప్పులలో 1, పాలకుర్తిలో 1 పరీ క్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,966 మంది, ఒకేషనల్ విద్యార్థులు 372మంది, మొత్తం 2,338 మంది ఉన్నారన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 957 మంది, ఒకేషనల్ విద్యార్థులు 302మంది మొత్తం 1,259మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో డెక్ సభ్యురాలు సునంద, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్
సభ్యురాలిగా చిట్యాల శ్వేత
పాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుఽఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనువరాలు చిట్యాల శ్వేతను నియమిస్తున్న సోమవారం ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుఽధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళ కమిషన్ సభ్యురాలుగా నియమించడంపై అమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ కళాశాలలో విద్యా వారోత్సవాలు
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సోమవారం విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కమలాకర్, అధ్యాపకులు నరేందర్‌రావు, లావణ్య, శ్వేత, రాంబాబు, రాజీవ్, సహజ, సంతోష, థామస్, రమేశ్, స్రవంతి, ప్రేమ్, సౌందర్య, నరేష్, ప్రదీప్ పాల్గొన్నారు.
రేపటి నుంచి కాకతీయ కళల జాతర
నయీంనగర్: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్‌బోర్డ్ మెంబర్, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్, సునీల్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు.
జూన్ 1 నుంచి తరగతులు..
మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది.


