జనగామ: విద్యుత్, రోడ్డు భద్రత పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని వారు ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులు, ప్రజలు భద్రతా ప్రమాణాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కరెంటు ఎల్సీ తీసుకునే సమయంలో యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించుకోవాలని ఎస్‌ఈ సూచించారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, రూరల్ ఏఈ మధు, పెంబర్తి ఏఈ కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి
డీసీపీ రాజమహేంద్ర నాయక్


