● ఒక్కసారిగా దగ్ధమైన పాలవ్యాపారి
ద్విచక్రవాహనం
● మంటలు తీవ్రంగా వ్యాపించడంతో
కాలనీవాసుల భయాందోళన
జనగామ: పట్టణంలో మంగళవారం ఓ బైక్ దగ్ధమైన ఘటన కాలనీ వాసులను టెన్షన్‌కు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం పడమటిగూడెం గ్రామానికి చెందిన ఉడుముల ధర్మారెడ్డి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పట్టణానికి వచ్చి కాలనీల్లో రెగ్యులర్ ఖాతాదారులకు పాల డబ్బాలు ఇచ్చి వెళ్లుంటాడు. రోజువారీలాగే తన బైక్‌పై ఉదయం 7 గంటలకు గణేష్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకున్నాడు. అక్కడ తన బైక్‌ను నిలిపి, ఇంటింటికీ వెళ్లి పాల డబ్బాలు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వారంతా పరుగులు పెట్టా రు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 100తో పాటు అగ్నిమాపక శాఖకు డయల్ చేయగా, పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పేయగా, అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బైక్‌కు సంబంధించి అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


