190 ఈఓ పోస్టులతో దేవాలయ పాలన సులభం | - | Sakshi
Sakshi News home page

190 ఈఓ పోస్టులతో దేవాలయ పాలన సులభం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

పాలకుర్తి టౌన్‌: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖకు నూతనంగా 190 కార్యనిర్వహణాధికారుల పోస్టులు మంజూరు చేయడంతో దేవాలయాల పరిపాలన సులభమవుతుందని అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ అన్నారు. శనివారం హన్మకొండలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసంలో అర్చక ఉద్యోగ నేతలు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా జీఓ 42 కాపీని మంత్రి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి రంగారెడ్డి, టక్కర్సు సత్యం, సూపరింటెండెంట్లు చారి, విజయ్‌, కొత్తపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement