ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్‌ ముందు వైఎస్సార్‌సీపీ ధర్నా | Jogi Ramesh Fires On Illegal Arrest Of Ysrcp Leader | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్‌ ముందు వైఎస్సార్‌సీపీ ధర్నా

Sep 29 2025 12:18 PM | Updated on Sep 29 2025 12:50 PM

Jogi Ramesh Fires On Illegal Arrest Of Ysrcp Leader

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్‌ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వైఎస్సార్‌సీపీ నేత అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్‌ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement