పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌ | YSRCP wins Salur Makkuva ZPTC Seats | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

Nov 8 2026 12:16 PM | Updated on Nov 8 2026 12:16 PM

YSRCP wins Salur Makkuva ZPTC Seats

సాక్షి, పార్వతీపురం మన్యం: అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు తెర తీసినా.. ఎంత దౌర్జన్యాలకు తెగించినా.. పరిషత్తు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలుపుకొంది. ఎన్నికల సమయంలో యథేచ్ఛగా రిగ్గింగుకు అధికార పార్టీ నాయకులు తెర తీసిన విషయం విదితమే. ఎన్నికలను ఏకపక్షంగా మార్చేస్తామంటూ బహిరంగంగానే ఆ పార్టీ నాయకులు ప్రకటనలు గుప్పించారు. ఎన్ని అక్రమాలకు తెర తీసినా.. కుట్రలకు పాల్పడినా ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నియోజకవర్గంలో అధికార పార్టీకి ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. 

ఇక్కడ సాలూరు, మక్కువ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. దీంతో పాటు మక్కువ ఎంపీపీ స్థానం కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరింది. పార్వతీపురం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు.  ఈ నెల 5న జిల్లాలోని 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరిగిన విషయం విదితమే. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు శనివారం చేపట్టారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ కౌంటింగ్‌ కొనసాగింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement