ఇన్‌వ్యాలీడ్‌ ఓటూ టీడీపీ ఖాతాలో.. | YSRCP candidate protests K Santapalem MPTC election counting dispute recounting demand | Sakshi
Sakshi News home page

ఇన్‌వ్యాలీడ్‌ ఓటూ టీడీపీ ఖాతాలో..

Nov 8 2026 11:27 AM | Updated on Nov 8 2026 11:27 AM

YSRCP candidate protests K Santapalem MPTC election counting dispute recounting demand

కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసనకు దిగిన ఎంపీటీసీ అభ్యర్థి వెంకటలక్ష్మి, ఆమె భర్త అవతారం, వైఎస్సార్‌సీపీ నాయకులు

అనకాపల్లి: కె.సంతపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్‌కు చెందిన పలితంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సబ్బవరపు వెంకటలక్ష్మితో పాటు ఆమె భర్త అవతారం, వెఎస్సార్‌సీపీ నాయకులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. కె.సంతపాలెం సెగ్మెంట్‌లో పోలైన 3141 ఓట్లులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సబ్బవరపు వెంకటలక్ష్మి 1522, టీడీపీ అభ్యర్థి సబ్బవరపు పుష్పావతికి 1522 ఓట్లు వచ్చినట్టు అవతారం తెలిపారు. ఇద్దరికీ చెరి సమానంగా ఓట్లు వచ్చాయని, టీడీపీ అభ్యర్థి సబ్బవరపు పుష్పావతికి కౌంటింగ్‌ అధికారులు ఇన్‌వాలీడ్‌లో ఉన్న ఓటును టీడీపీ అభ్యర్థికి వేసి 1523 ఓట్లుతో గెలుపొందినట్లు ప్రకటించారని అన్నా రు. కౌంటింగ్‌ ఏజెంట్‌గా ఉన్న తన అంగీకారం లేకుండా ఇన్‌వాలీడ్‌లో ఉన్న ఓటును టీడీపీ అభ్యర్థికి వేసి గెలిచారని ప్రకటించడం దారుణమన్నారు. రీకౌంటింగ్‌ను నిర్వహించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసనకు దిగారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement