టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా | YSRCP Wins Rajayyapeta MPTC Seat After Three Decades TDP Stronghold | Sakshi
Sakshi News home page

టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా

Nov 8 2026 10:16 AM | Updated on Nov 8 2026 10:20 AM

YSRCP Wins Rajayyapeta MPTC Seat After Three Decades TDP Stronghold

అత్యధిక మెజార్టీ సాధించిన రాజయ్యపేట ఎంపీటీసీ పిక్కి కాశీ, పెదతీనార్ల నుంచి గెలిచిన మత్స్యకార మహిళ సరోనా, బంగారయ్యపేట నుంచి విజయం సాధించిన కొవిరి రమణ

అల్లూరి సీతారామరాజు జిల్లా: టీడీపీ కంచుకోటలో ఈ దఫా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పాగా వేసింది. మూడు దశాబ్దాల తర్వాత మత్స్యకార గ్రామాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలో గత సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి వంగలపూడి అనితకు 1500 ఓట్ల మెజార్టీ ఇచ్చిన రాజయ్యపేటలో ఈ దఫా ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పిక్కి కాశీ తన ప్రత్యర్థి పిక్కి రమణ(కూటమి)పై 664 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. 

పెదతీనార్ల మత్స్యకార గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మైలపల్లి సరోనా తన సమీప ప్రత్యర్థి మైలపల్లి రమాదేవిపై 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో మత్స్యకార గ్రామం బంగారయ్యపేట సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొవిరి రమణ తన సమీప టీడీపీ అభ్యర్థి ఏవీఎస్‌ రాజుపై 161 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్లన్నీ గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. మత్స్యకారులంతా 40 ఏళ్లనుంచి టీడీపీకే ఓటేస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాజయ్యపేటలో 6,500 పైచిలుకు ఓటర్లు ఉన్నారు.

 స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఈ గ్రా మం నుంచి టీడీపీకి 80 శాతం ఓట్లు లభిస్తాయి. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి 2 నుంచి 3 వేల ఆధిక్యత లభించేది. అటువంటిది ఈ ఎన్నికల్లో రాజయ్యపేటలో ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది. మత్స్యకారులంతా వైఎస్సార్‌సీపీనే ఆదరించారు. ఎక్కువ ఓట్లు కలిగిన రాజయ్యపేట, పెదతీనార్ల, బంగారయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీని ఆదరించడం చర్చనీయాంశమైంది. రాజయ్యపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మండలంలోనే అత్యధికంగా 664 ఓట్ల మెజార్టీ రావడాన్ని అధికార పారీ్టకి పెద్ద దెబ్బ అని పలువురు అంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement