21 ఏళ్లకే ఎంపీటీసీగా లెక్కల శ్రావణి | 21 year old Lekkalas Sravani elected as MPTC | Sakshi
Sakshi News home page

21 ఏళ్లకే ఎంపీటీసీగా లెక్కల శ్రావణి

Nov 8 2026 10:02 AM | Updated on Nov 8 2026 10:03 AM

21 year old Lekkalas Sravani elected as MPTC

అల్లూరి సీతారామరాజు జిల్లా : 21 ఏళ్లకే గొరపూడి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి లెక్కల శ్రావణి విజయం సాధించారు. గొరపూడి శివారు అప్పన్నపాలేనికి చెందిన శ్రావణి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఇటీవలే ఆమెకు వివాహమైంది. టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి లాలం అరుణపై 290 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో తాను రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందానని శ్రావణి పేర్కొన్నారు.    

ఇదీ చదవండి: ఈ కన్నీటికి కారణమెవరు..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement