
మాడ్రిడ్: స్పెయిన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళలకు మరో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్‌లో భారత జట్టు 1-4 తేడాతో పరాజయం పాలైంది. దాంతో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడింది. తాజా మ్యాచ్‌లో ఆద్యంతం ఎదురుదాడికి దిగిన స్పెయిన్ మహిళలు వరుసగా గోల్స్‌తో దూసుకుపోయారు. మ్యాచ్ 10, 34 నిమిషాల్లో లోలా రీఎరా గోల్స్ చేయగా, 19వ నిమిషంలో లూసియా జిమెనెజ్, 37వ నిమిషంలో కార‍్మెన్ కానో మరో గోల్ సాధించారు.
భారత తరపున ఉదితా (22వ నిమిషంలో) మాత్రమే గోల్ చేయడంతో భారీ ఓటమి తప్పలేదు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో గెలవగా, రెండో గేమ్ డ్రాగా ముగిసింది. ఇక మూడో మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. సోమవారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారత్ గెలిచిన పక్షంలో సిరీస్‌ను డ్రాతో ముగిస్తుంది. ఒకవేళ స్పెయిన్ విజయం సాధించినా, డ్రా చేసుకున్నా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.