సెమీస్ లో భారత్ | India thrash Kazakhstan, enter semis of Asian women's hockey | Sakshi
Sakshi News home page

సెమీస్ లో భారత్

Nov 2 2017 1:37 PM | Updated on Nov 2 2017 1:37 PM

India thrash Kazakhstan, enter semis of Asian women's hockey - Sakshi

కకమిగహర(జపాన్): ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ లో భారత్ మహిళలు తమ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. పూల్-ఎలో హ్యాట్రిక్ విజయాలతో క్వార్టర్స్ కు చేరిన భారత మహిళలు.. తాజాగా జరిగిన క్వార్టర్స్ పోరులో సైతం విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 7-1 తేడాతో కజికిస్థాన్ ఓడించి సెమీస్ లోకి ప్రవేశించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్ మూడు గోల్స్(4, 42,56 నిమిషాల్లో) తో ఆకట్టుకోగా, నవనీత్ కౌర్(22, 27 నిమిషాలు),  దీప్ ఎక్కా(16, 41 నిమిషాలు) తలో రెండు గోల్స్ తో మెరిశారు.

ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే కజికిస్థాన్ క్రీడాకారిణి దోమష్రెనివా గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే నాల్గో నిమిషంలో గుర్జిత్ కౌర్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తరువాత 16, 22, 27 నిమిషాల్లో భారత్ గోల్స్ చేస్తూ తమ ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. అదే జోరును కడవరకూ కొనసాగించిన భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement