ఖాతా తెరవకుండానే భారత్ ఇంటికి! | Argentina thrash India 5-0 in Pool B match in rio 2016 Women's Hockey | Sakshi
Sakshi News home page

ఖాతా తెరవకుండానే భారత్ ఇంటికి!

Aug 13 2016 8:14 PM | Updated on Sep 4 2017 9:08 AM

ఖాతా తెరవకుండానే భారత్ ఇంటికి!

ఖాతా తెరవకుండానే భారత్ ఇంటికి!

రియోలో భారత హాకీ మహిళల జట్టు పేలవ ప్రదర్శన మరోసారి కొనసాగింది.

రియోలో భారత హాకీ మహిళల జట్టు పేలవ ప్రదర్శన మరోసారి కొనసాగింది. వరుస పరాజయాలతో క్వార్టర్స్ చేరుకోకుండానే బారత హాకీ మహిళా క్రీడాకారిణులు ఇంటిదారి పట్టారు. గ్రూప్-బీ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల జట్టు చేతిలో 5-0 తేడాతో బారత మహిళల టీమ్ ఓటమి చవిచూసింది. దీంతో 5 మ్యాచ్లాడిన భారత జట్టు ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది. కాగా, ఒక్క మ్యాచ్ డ్రా చేసుకుంది. మరోవైపు గ్రూప్-బీ నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా క్వార్టర్స్ కు దూసుకెళ్లాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement