ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక.. ఐదుగురికి తొలిసారి చోటు | Indian Women Hockey Team For Australia Tour Announced | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక.. ఐదుగురికి తొలిసారి చోటు

Apr 15 2025 1:31 PM | Updated on Apr 15 2025 2:56 PM

Indian Women Hockey Team For Australia Tour Announced

కెప్టెన్‌గా సలీమా టెటె కొనసాగింపు  

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. 26 మందిలో ఐదుగురు జ్యోతి సింగ్, సుజాత కుజుర్, అజ్మీనా కుజుర్, పూజా యాదవ్, మహిమా టెటె తొలిసారి భారత సీనియర్‌ జట్టులోకి వచ్చారు. బన్సారి సోలంకి, అంజన డుంగ్‌డుంగ్, లాల్‌థంట్లాంగి, సాక్షి శుక్లా, ఖైదెమ్‌ షిలీమా చాను, దీపి మోనికా టొప్పో, సోనమ్‌లను స్టాండ్‌బై ప్లేయర్లుగా  ఎంపికయ్యారు.

ఏప్రిల్‌ 21 నుంచి మే 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. తొలుత ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్‌లు... అనంతరం ఆ్రస్టేలియా సీనియర్‌ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. జూన్‌లో జరిగే యూరోపియన్‌ అంచె ప్రొ హాకీ లీగ్‌కు సన్నాహకంగా భారత జట్టుకు ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఉపయోగపడనుంది.  

భారత మహిళల హాకీ జట్టు: సవితా పూనియా, బిచ్చూ దేవి ఖరీబమ్‌ (గోల్‌కీపర్లు), జ్యోతి సింగ్, ఇషికా చౌధరీ, సుశీలా చాను, సుజాత కుజుర్, సుమన్‌ దేవి తౌడమ్, జ్యోతి, అజ్మీనా కుజుర్, సాక్షి రాణా (డిఫెండర్లు), సలీమా టెటె, వైష్ణవి ఫాలే్క, నేహా, షర్మీలా దేవి, మనీషా చౌహాన్, సునెలిటా టొప్పో, మహిమా టెటె, పూజా యాదవ్, లాల్‌రెమ్‌సియామి (మిడ్‌ ఫీల్డర్లు), నవ్‌నీత్‌ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ముంతాజ్‌ ఖాన్, బల్జీత్‌ కౌర్, దీపిక సొరెంగ్, బ్యూటీ డుంగ్‌డుంగ్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement