ఛాంపియన్‌ భారత్‌ | Sakshi
Sakshi News home page

ఛాంపియన్‌ భారత్‌

Published Mon, Nov 6 2023 9:27 AM

India Beat Japan To Win othe - Sakshi

రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో జపాన్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్‌ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు  చొప్పున అందజేస్తామని తెలిపింది.    


 

Advertisement
 
Advertisement