తొలి గెలుపు కోసం... | India face Spain in FIH Pro League | Sakshi
Sakshi News home page

తొలి గెలుపు కోసం...

Feb 21 2026 8:07 AM | Updated on Feb 21 2026 11:30 AM

India face Spain in FIH Pro League

పురుషుల హాకీ ప్రొ లీగ్‌ రెండో అంచె బరిలో భారత్‌

నేడు స్పెయిన్‌తో హార్దిక్‌ సింగ్‌ బృందం పోరు  

హోబర్ట్‌: సొంతగడ్డపై జరిగిన పురుషుల ప్రొ లీగ్‌ తొలి అంచెలో భారత హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. అర్జెంటీనా, బెల్జియం జట్లతో రెండుసార్లు చొప్పున ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపు రుచి చూడలేదు. ఇప్పుడు రెండో అంచె మ్యాచ్‌లకు భారత బృందం సిద్ధమైంది. 

నేడు జరిగే తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడుతుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత 24న స్పెయిన్‌తో, 25న ఆ్రస్టేలియాతో టీమిండియా ఆడుతుంది. భారత అంచె పోటీల్లో సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలరీత్యా రెండో అంచె మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ స్థానంలో హార్దిక్‌ సింగ్‌ భారత జట్టుకు నేతృత్వం వహిస్తాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో హార్దిక్‌ సింగ్‌ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ‘స్వదేశంలో జరిగిన తొలి అంచె మ్యాచ్‌ల్లో పొరపాట్లు ఎక్కడ జరిగాయో సమీక్షించాం. గెలుపు బోణీ కొట్టాలనే లక్ష్యంతోనే ఆ్రస్టేలియాకు వచ్చాం’ అని మిడ్‌ఫీల్డ్‌లో ఆడే హార్దిక్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.    

Advertisement
 
Advertisement
Advertisement