breaking news
league
-
హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ గెలుపుబాట
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు మళ్లీ విజయం రుచి చూసింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 15–13, 20–18, 15–17, 15–9తో గోవా గార్డియన్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బ్లాక్‌హాక్స్ ఏడు పాయింట్లతో ఆరో స్థానానికి చేరింది. యుదీ యామమోటో, సాహిల్, విటోర్, శిఖర్ సింగ్ స్మాష్‌లతో చెలరేగి బ్లాక్‌హాక్స్‌కు నిలకడగా పాయింట్లు అందించారు. సమష్టిగా రాణించి బ్లాక్‌హాక్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టినందుకు ఆనందంగా ఉందని యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మ్యాచ్ మొత్తంలో బ్లాక్‌హాక్స్ 65 పాయింట్లు నెగ్గగా... ఇందులో సొంత సర్వీస్‌లో 20 పాయింట్లు, స్మాష్‌లతో 27 పాయింట్లు వచ్చాయి. -
ఒకే జట్టులో అర్జున్, గుకేశ్ ,హంపి, హారిక
ముంబై: ప్రపంచ చదరంగంలోని మేటి ప్లేయర్లు ఒకే వేదికపై వచ్చి ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. టెక్ మహీంద్ర, అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మూడో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ పూర్తయింది. భారత్ నుంచి తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకర్ దొమ్మరాజు గుకేశ్... ప్రపంచ ఐదో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. గుకేశ్, అర్జున్‌లను పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు సొంతం చేసుకుంది. భారత స్టార్ మహిళా గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ మహిళల ర్యాపిడ్ ఫార్మాట్ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ కోనేరు హంపి, ప్రపంచ 19వ ర్యాంకర్, హైదరాబాద్‌కు చెందిన హారికను అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టు దక్కించుకుంది. డిసెంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ మెగా లీగ్‌కు ముంబై ఆతిథ్యమిస్తుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు తరఫున కొనసాగుతుండగా... భారత నంబర్‌వన్ ప్రజ్ఞానంద అల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టుకు ఆడనున్నాడు. మొత్తం ఆరు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. గేమ్‌లను ర్యాపిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఒక్కో జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఉండగా... అందులో ఇద్దరు మహిళా క్రీడాకారిణులున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ జట్ల వివరాలు అమెరికన్ గాంబిట్స్: హికారు నకముర (అమెరికా), రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి), వ్లాదిస్లావ్ అర్తెమియెవ్ (రష్యా), బీబీసారా అసయుబయేవా (కజకిస్తాన్), టియోడోరా ఇంజాక్ (సెర్బియా), వొలోడార్ ముర్జిన్ (రష్యా). అల్పైన్ ఎస్జీ పైపర్స్: ఫాబియానో కరువానా (అమెరికా), ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), హు ఇఫాన్ (చైనా), నినో బత్సియాష్విలి (జార్జియా), లియోన్ మెన్డోంకా (భారత్). గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్: విశ్వనాథన్ ఆనంద్ (భారత్), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), స్టవ్రూలా సొలాకిడూ (గ్రీస్), పొలీనా షువలోవా (రష్యా), రౌనక్ సాధ్వాని (భారత్). అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్: మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), వెస్లీ సో (అమెరికా), కోనేరు హంపి (భారత్), ద్రోణవల్లి హారిక (భారత్), బర్దియా దానేశ్వర్ (ఇరాన్). పీబీజీ అలాస్కాన్ నైట్స్: దొమ్మరాజు గుకేశ్ (భారత్), ఇరిగేశి అర్జున్ (భారత్), లీనియర్ డొమింగెజ్ (అమెరికా), సారాసాదత్ ఖాడెమ్ (స్పెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), డేనియల్ దర్ధా (బెల్జియం). త్రివేణి కాంటినెంటల్ కింగ్స్: అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), యి వె (చైనా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్), అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), జు జినెర్ (చైనా), మార్క్ ఆండ్రియా మౌరిజి (ఫ్రాన్స్). -
రేపు గ్లోబల్ చెస్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్టింగ్
ముంబై: ప్రపంచ చదరంగ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) ‘ఐకాన్’ ప్లేయర్లుగా వ్యవహరించనున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ శుక్రవారం జరగనుంది. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి చెన్నై వేదికగా లీగ్ జరగనుంది. గత రెండు సీజన్లను వరుసగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్‌లో నిర్వహించారు. ఫిడే, టెక్ మహేంద్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో 6 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. అమెరికా గ్రాండ్‌మాస్టర్లు హికారు నకముర, ఫాబియానో కరువానా, అలీరెజా ఫిరూజా, లాగ్రేవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు సహా మొత్తం 36 మంది ప్లేయర్లు ఈ డ్రాఫ్టింగ్‌లో పాల్గొననున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి, అనీశ్ గిరి, ప్రపంచకప్ రన్నరప్ కోనేరు హంపి కూడా ఇందులో భాగం కానున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీ ‘ఐకాన్ ప్లేయర్స్’, ‘మెన్స్’, ‘వుమెన్స్’, ‘అండర్–21’ వంటి నాలుగు విభాగాల్లో ఆటగాళ్లను ఎంపిక చేసుకోనుంది. ఒక్కో ఫ్రాంచైజీ ఒక ఐకాన్ ప్లేయర్, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక అండర్–21 ప్లేయర్‌ను కలుపుకొని మొత్తం ఆరుగురిని ఎంపిక చేసుకోవచ్చు.‘జీసీఎల్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది తెలివితేటలు, సమష్టితత్వం, సృజనాత్మకతకు సంబంధించిన వేడుక. మన దేశం నుంచి ప్రపంచ వేదికపై ఇలాంటి లీగ్ జరుగుతుండటం గర్వంగా ఉంది’ అని ఆనంద్ పేర్కొన్నాడు. -
మా వల్ల కాదంటూ మరో ఫ్రాంచైజీ అవుట్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు మరో ఫ్రాంచైజీ గుడ్‌బై చెప్పేసింది. లక్నో ఫ్రాంచైజీ యూపీ రుద్రాస్ లీగ్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. నిర్వహణ సవాళ్ల కారణంగా లీగ్‌లో కొనసాగలేమని యాజమాన్యం వెల్లడించింది. భరించలేని ఆరి్థకభారం వల్లే లీగ్ నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది చాలా కఠినమైన నిర్ణయమని యూపీ రుద్రాస్ టీమ్ డైరెక్టర్ సెడ్రిక్ డిసౌజా తెలిపారు. ‘హాకీ ఇండియా మొదలుపెట్టిన హెచ్ఐఎల్ మేం ఎంతో విలువిచ్చాం. ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఆర్థిక సవాళ్లు మమ్మల్ని లీగ్‌లో కొనసాగేందుకు అసాధ్యంగా మార్చాయి. దీర్ఘ కాలిక లక్ష్యాలతో పనిచేసే అవకాశం లేకపోవడంతో తప్పుకుంటున్నాం. అయితే భారత్‌లో హాకీ ఉన్నత శిఖరాల్లో నిలువాలని ఆకాంక్షిస్తున్నాం’ అని సెడ్రిక్ డిసౌజా అన్నారు. ఈ జట్టుకు ఆడిన భారత హాకీ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ మాట్లాడుతూ యూపీ రుద్రాస్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అభిమానులు సైతం మా జట్టును ఆదరించారని అన్నాడు. కానీ ఇప్పుడా అధ్యాయం ముగిసిపోవడం విచారకరమన్నాడు. లీగ్‌కు దూరమైన మూడో జట్టు రుద్రాస్. ఇదివరకే మహిళల చాంపియన్ జట్టు ఒడిశా వారియర్స్ సహా పురుషుల్లో గోనాసిక టీమ్ లీగ్‌కు రాంరాం చెప్పాయి. దీంతో వచ్చే సీజన్ కోసం రాంచీ రాయల్ టస్కర్స్ (ఇరు విభాగాల్లో)తో రెండు జట్లను భర్తీ చేసుకోగా... తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ)కి రుద్రాస్ షాకిచ్చింది. -
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
క్రికెట్లోకి రామ్ చరణ్ ఎంట్రీ.. ఆ జట్టుకు!
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగా హీరో ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారి తమ ముద్దుల కూతురితో ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. మహారాష్ట్ర సీఎంను కూడా కలిశారు. అయితే చెర్రీ ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌లైన్స్ వ్యాపారం చేస్తోన్న రామ్ చరణ్.. ఏకంగా క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఐఎస్పీఎల్ టోర్నీలో హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ అద్భుతమైన లీగ్‌లో నాతో పాటు పాలు పంచుకునేందుకు నాతో చేరండి అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు రామ్ చరణ్‌కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. క్రికెట్ లీగ్‌లోనూ చెర్రీ అడుగుపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. Excited to announce my ownership of Team Hyderabad in the Indian Street Premier League! Beyond cricket, this venture is about nurturing talent, fostering community spirit, and celebrating street cricket's essence. Join me as we elevate Hyderabad's presence in the ISPL,… pic.twitter.com/DQA29n18qp — Ram Charan (@AlwaysRamCharan) December 24, 2023 -
ప్రీమియర్ లీగ్‌లో అమితాబ్ బచ్చన్.. ఏకంగా ముంబై జట్టునే!
బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రీడల్లోనూ అడుగుపెట్టారు. సీనియర్ నటుడు సడన్‌గా ఆటల్లోకి ఎలా వచ్చారని అనుకుంటున్నారా? అయితే అమితాబ్ ఎంట్రీ ఇచ్చింది ఆటగాడిగా కాదండి.. ఆయన కూడా ప్రముఖ క్రికెట్ లీగ్‌లో జట్టును కొనుగోలు చేశారు. టెన్నిస్ బాల్ టీ10 క్రికెట్ టోర్నీ ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్‌లో అమితాబ్ ముంబయి టీమ్‌ను దక్కించున్నారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబయిలో తొలి సీజన్ జరగనుంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు ఈ లీగ్‌లో బరిలో ఉన్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్‌కుమార్, హృతిక్ రోషన్ కూడా ఇటీవలే ఐఎస్పీఎల్ జట్లను కొనుగోలు చేశారు. శ్రీనగర్‌ను అక్షయ్.. బెంగళూరును హృతిక్ తీసుకున్నారు. -
APL 2023: బెజవాడ టైగర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం(ఫొటోలు)
-
‘గ్లోబల్ టీమ్‌ను తయారు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడల్లో గత కొన్నేళ్లుగా వేర్వేరు లీగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ క్రీడాంశాల్లో సాగుతున్న ఈ లీగ్‌లపై అటు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుండగా, ఇటు పలు వ్యాపార వర్గాలు లీగ్‌లతో జత కట్టి తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్’ నడుస్తోంది. జైపూర్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన టోర్నీ 25 వరకు సాగనుంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ‘తెలుగు టాలన్స్’ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. అభిషేక్‌కే చెందిన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ టీమ్ ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడుతోంది. అంతకుముందే ఆయన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో పాటు బాక్సింగ్ లీగ్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు. క్రీడలపై అభిరుచితో పాటు ఎక్కువ మందికి ఆయా క్రీడాంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్, అందులో తన టీమ్ తెలుగు టాలన్స్ పాత్రకు సంబంధించి వివిధ అంశాలపై అభిషేక్ ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... వరుసగా లీగ్‌లలో జట్లను కొనడంపై... మొదటి నుంచి నాకు క్రీడలపై అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పెద్ద ఈవెంట్లను అనుసరించేవాడిని. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి పోటీలకు ప్రత్యక్షంగా తిలకిస్తున్న సమయంలో అక్కడి అభిమానులు చూపించే ఆసక్తి, ఆట పట్ల అక్కడ ఉండే క్రేజ్ నన్ను ఆశ్చర్యపర్చాయి. మన దేశంలో క్రికెటేతర క్రీడల్లో మనం ఇలాంటిది చాలా తక్కువగా చూస్తాం. అయితే లీగ్‌లు రంగప్రవేశం చేశాక ఫ్యాన్స్ కూడా సదరు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు. నా ప్రవృత్తి క్రీడలు. అందుకే ఏదో రూపంలో వాటితో జత కట్టాలని భావించాను. వాలీబాల్ లీగ్‌కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన చూసి ఇప్పుడు హ్యాండ్‌బాల్ వైపు వచ్చాం. హ్యాండ్‌బాల్‌లో లీగ్ అవసరం గురించి... మన దగ్గర కూడా హ్యాండ్‌బాల్ పోటీలను రెగ్యులర్‌గా చూసే అభిమానులు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలా చోట్ల అది అవుట్డోర్ గేమ్‌గా, మట్టి కోర్టులలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యూరోపియన్ శైలిలో ఇండోర్ హ్యాండ్‌బాల్ బాగా పాపులర్. అలాంటి ఆటను ఇప్పుడు లీగ్ ద్వారా అందరికీ చేరువ చేస్తున్నాం. తెలుగు టాలన్స్ ప్రదర్శనపై... చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం. తొలి లీగ్ విజేతగా కూడా నిలుస్తామనే నమ్మకం ఉంది. లీగ్‌లోని ఆరు జట్లలోనూ మా ఒక్క టీమ్‌కే విదేశీ కోచ్ (ఫెర్నాండో న్యూనెస్–పోర్చుగల్) ఉన్నాడు. ఆయన నేతృత్వంలో టీమ్ చాలా బాగా ఆడటమే కాదు, లీగ్‌లో ఒక టీమ్‌ను, ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దాలో కూడా దిశానిర్దేశం చేసేలా కోచింగ్ సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్ల గురించి... ఈ విషయంలో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొందరు చక్కటి హ్యాండ్‌బాల్ ఆటగాళ్లు ఉన్నా... మా లీగ్‌కు తగినట్లుగా కొన్ని ప్రమాణాల ప్రకారం మాకు తగిన ఆటగాళ్లు లభించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారడం ఖాయం. లీగ్ కూడా అందుకు సహకరిస్తుంది. ఈసారి జట్టులో హైదరాబాద్‌లో ఆర్మీలో పని చేస్తున్న ఏడుగురు ఏఓసీ ఆటగాళ్లను మాత్రం తీసుకున్నాం. టీమ్ యజమానిగా ఆర్థిక అంశాలపై... లీగ్లలోకి అడుగు పెట్టేటప్పుడే నాకు దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇవి ఇతర వ్యాపారాల్లాగా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కావు. మా ఉత్సాహం మాత్రమే టీమ్‌ను నడిపిస్తుంది. అయితే లాభం గురించి బెంగ లేదు. లీగ్‌తో పాటు సదరు క్రీడ కూడా పైస్థాయికి ఎదగడం ముఖ్యం. స్పాన్సర్లు ముందుకు రావడం కూడా సానుకూల పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తలపడే గ్లోబల్ టీమ్‌ను తయారు చేయడమే మా లక్ష్యం. -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్‌గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్‌కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
Hyderabad: నిలిచిపోయిన కార్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై టర్బో రైడర్స్ మహిళారేసర్కు గాయాలయ్యాయి. క్వాలి ఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. రేసింగ్ ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. ఫార్మూలా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. కాగా, శనివారం మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చదవండి: టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు? -
‘మనం పూర్తిగా లాక్డౌన్ అయిపోయాం’
దుబాయ్: ప్రస్తుతం తాను ఐపీఎల్లో ఎలా ఆడాలి అన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇప్పుడు తన దృష్టిలో అన్నింటికంటే ఐపీఎల్ లీగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఈ ఏడాది జట్టులో పలు మార్పులు జరిగాయి. భారత అనుభవజ్ఞులు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ సహా ఆసీస్ ఆటగాడు స్టొయినిస్ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగుతుండటంతో ఎంతో సంతోషంగా ఉంది. నా సహచరులు కూడా అలాంటి అనుభూతితోనే ఉన్నారు. కొన్ని నెలలు మనం పూర్తిగా లాక్డౌన్ అయిపోయాం. నేనైతే షాడో ప్రాక్టీస్ చేశాను. కానీ అసలైన ప్రాక్టీస్, ఆటకు చాలా తేడా ఉంటుంది. ఆడే అనుభవమే వేరు అని తెలిపాడు. గత లీగ్ కంటే ఈ ఐపీఎల్ చాలా భిన్నమైనదని, కెప్టెన్‌గా నాపై ఉన్న అతి ముఖ్యమైన బాధ్యత ఐసీఎల్. ఈ టోర్నీకి పడిన అడుగులు, సాగే ఆటలు అన్నీ భిన్నమైనవే’నని అయ్యర్ వివరించాడు. (చెన్నై ‘హైరానా’) -
ఒడిశా వారియర్స్‌కు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న ‘బిగ్ బౌట్ ఇండియన్ బాక్సింగ్ లీగ్’ బరిలో దిగే బాక్సర్ల వివరాలను ప్రకటించారు. ఈ లీగ్ డిసెంబర్ 2 నుంచి 21 వరకు జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణ బాక్సర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్ ఒడిశా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పంజాబ్ రాయల్స్ తరఫున పోటీపడనుంది. వీరిద్దరు 51 కేజీల విభాగంలో బరిలోకి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ పురుషుల 52 కేజీల విభాగంలో పంజాబ్ రాయల్స్ జట్టుకు ఆడతాడు. ఇదే విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ టీమ్ గుజరాత్ అదానీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. జట్ల వివరాలు ఒడిశా వారియర్స్, బెంగళూరు బ్రాలర్స్, పంజాబ్ రాయల్స్, టీమ్ గుజరాత్ అదానీ, బాంబే బుల్లెట్స్, నార్త్ ఈస్ట్ రైనోస్. వెయిట్ కేటగిరీలు మహిళల విభాగం: 51 కేజీలు, 60 కేజీలు; పురుషుల విభాగం: 52 కేజీలు, 57 కేజీలు, 69 కేజీలు, 75 కేజీలు, 91 కేజీలు. -
ఇప్పుడు వాలీబాల్‌కూ ఓ లీగ్
ముంబై: భారత క్రీడల క్యాలెండర్లో వాలీబాల్ లీగ్ చేరింది. కొత్తగా ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌ను ఈ ఏడాదే నిర్వహించేందుకు భారత వాలీబాల్ సమాఖ్య (వీఎఫ్ఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. జకార్తాలో ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల తర్వాత పీవీఎల్ నిర్వహిస్తామని వీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. భారత్‌లో వాలీబాల్‌కు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు, ఆటను మరో దశకు తీసుకెళ్లేందుకు ఈ లీగ్ దోహదం చేయగలదని ప్రొ వాలీబాల్ లీగ్ సీఈఓ జోయ్ భట్టాచార్య వెల్లడించారు. ఆరు ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొంటాయి. ఆసక్తిగలవారు రెండు ఫ్రాంచైజీల కోసం బిడ్లు దాఖలు చేయొచ్చు. ఫైనల్‌గా ఒక ఫ్రాంచైజీని మాత్రమే కేటాయిస్తారు. మంగళవారం నుంచి బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం జూలైలో ఆటగాళ్ల వేలం ఉంటుంది. భారత్‌కు చెందిన 90 మంది ఆటగాళ్లను వేలంలో కొనొచ్చు. కానీ విదేశీ ఆటగాళ్లను మాత్రం ముందస్తు ఒప్పందం ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత్‌లోని కేవలం రెండు వేదికల్లోనే 18 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. నిజానికి వాలీబాల్ లీగ్ ఇప్పుడే కొత్తకాదు. 2011లోనే భారత వాలీబాల్ సమాఖ్య ఆధ్వర్యంలోనే ఇండియన్ వాలీబాల్ లీగ్ (ఐవీఎల్) జరిగింది. అప్పుడు కూడా ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనగా చెన్నై టైటిల్ గెలిచింది. కానీ ఇది ఏమాత్రం ఆదరణకు నోచుకోకపోవడంతో మొదటి సీజనే ఆఖరిదైంది. -
రాష్ట్రంలో తొలిసారిగా ఐబీఎల్ తరహాలో ఏబీఎల్
ఏపీబీఏ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి పోటీలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పేర్లతో ఐదు ఫ్రాంచైజీలు గోదావరి జిల్లాల ఫ్రాంచైజీ టీఎన్‌రెడ్డి ‘‘గోదావరి గన్స్’’ రాజమహేంద్రవరంలో ఈ నెల 23న హోం టీమ్ పోటీలు ఏపీబీఏ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి వెల్లడి రావులపాలెం(కొత్తపేట) : ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) తరహాలో రాష్ట్రంలో తొలిసారిగా ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్(ఏబీఎల్) పేరుతో ఈ నెల 19 నుంచి పోటీలు ప్రారంభంకానున్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి చేపడుతున్న చర్యల్లో భాగంగా టీజీవీ భరత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ పేరుతో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు జట్లతో ఈ పోటీలు ఈ నెల 27 వరకూ నిర్వహిస్తున్నట్టు ఏపీబీఏ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆయన రావులపాలెంలో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కర్నూలులో ఐదు ఫ్రాంచైజీలకు వేలం జరిగిందన్నారు. గోదావరి జిల్లాలకు గోదావరి గన్స్, కర్నూలుకు రాయలసీమ వారియర్స్, విశాఖపట్నానికి విశాఖ స్మేషర్స్, ప్రకాశం జిల్లాకు ప్రకాశం బుల్స్, అమరావతికి అమరావతి ఏసర్స్ పేరుతో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశామన్నారు. వేలంలో ఆయా ప్రాంతాల స్పాన్సర్స్ జట్లను గెలుచుకున్నారన్నారు. ఈ పోటీలు ఏపీబీఏ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీల ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నగరాల్లో జరుగుతాయన్నారు. నెల 19న కర్నూలులో పోటీలు ప్రారంభమవువుతాయని మెయిన్ మ్యాచ్‌లు 20న జరుగుతాయన్నారు. అలాగే 22న విశాఖపట్నంలో, 23న రాజమహేంద్రవరంలో, 25న ఒంగోలులో, 26, 27 తేదీల్లో విజయవాడలో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి చోట నాలుగేసి జట్లు మెన్ సింగిల్స్, డబుల్స్, ఉమెన్ సింగిల్స్, మిక్స్‌డ్‌డబుల్స్, బాలుర అండర్–17 డబుల్స్ విభాగల్లో 10 మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ త్రీ విధానంలో 30 గేమ్‌లు ఆడతాయన్నారు. ఒక జట్టు విశ్రాంతిలో ఉంటుందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లు విజయవాడలో ఈ నెల 27న జరుగుతాయన్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 23న జరిగే మ్యాచ్‌లకు నారాయణపురంలోని కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియంను వేదికగా నిర్ణయించామన్నారు. టీఎన్‌రెడ్డి గోదావరి గన్స్ క్రీడాకారులు వీరే గోదావరి జిల్లా ఫ్రాంచైజీ టీఎన్‌రెడ్డి గోదావరి గన్స్‌లో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారన్నారు. ఎం.కనిష్క్(గుంటూరు), కె.చైతన్యరెడ్డి(రావులపాలెం), డీబీఎస్ చంద్రకుమార్(అనపర్తి), డి.పూజ(చిత్తూరు), ఎ.అక్షిత(రాజమహేంద్రవరం), బి.వెంకటేష్(శ్రీకాకుళం), కె.వరప్రసాద్(విజయనగరం), ఎస్కే ఖాజామోయినుద్దీన్(కడప)లు వివిధ విభాగాల్లో పోటీ పడతారన్నారు. వీరిలో కనిష్క్ మెన్ సింగిల్స్‌లో 87వ వరల్డ్ ర్యాంకర్ అని ఈ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీపడతారన్నారు. చంద్రకుమార్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, పూజ మిక్స్డ్ డబుల్స్, అక్షిత ఉమెన్ సింగిల్స్ వరప్రసాద్ డబుల్స్, ఖాజామోయినుద్దీన్ అండర్–17 బాలుర డబుల్స్, కె. చైతన్య రెడ్డి మెన్ డబుల్స్, వెంకటేష్ మెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీ పడతారన్నారు. జట్టుకు రాజమహేంద్రవరానికి చెందిన ఎన్వీ భద్రం కోచ్‌గా, అడ్వకేట్ ఎంఎస్బీ శంకర్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగే పోటీలకు స్పాన్స్‌ర్స్‌గా అడ్వకేట్ భాస్కర్రామ్, హోటల్ షెల్టాన్ ఎండీ కొడాలి తనూజ, రాక్‌ఎవన్యూస్ ఎండీ వేణు ఉన్నారన్నారు. అనంతరం గోదావరి గన్స్ బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కోడాలి తనూజ, సెక్రటరీ ఆర్వీఎస్ రామాంజనేయరాజు, అడ్వయిజర్ కర్రి శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నల్లమిల్లి వీర్రా«ఘవరెడ్డి, కె. బాలు, వెంకట్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్...
నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని 6 నగరాల్లో పోటీలు న్యూఢిల్లీ: ఇప్పటికే క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ లీగ్‌లను చూసిన భారత క్రీడాభిమానులకు మరో లీగ్ కనువిందు చేయనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), ప్రొ స్పోర్టీఫై సంస్థ ఆధ్వర్యంలో తాజాగా రెజ్లింగ్ క్రీడలోనూ ప్రొ లీగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని ఆరు నగరాల్లో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. భారత మేటి రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్, అనూజ్ చౌదరీ, గీత ఫోగట్, బబితా కుమారి, గీతిక జక్కర్ పలువురు మోడల్స్‌తో కలిసి ఈ ఆవిష్కరణోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విఖ్యాత పాప్ సింగర్ అపాచీ ఇండియన్ పీడబ్ల్యూఎల్ థీమ్ సాంగ్‌ను పాడగా... పలువురు రెజ్లర్లు గ్రీకు యుద్ధవీరుల వేషాధారణలో ర్యాంప్‌పైకి వచ్చారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ భారత క్రీడారంగంలో చారిత్రక క్షణం అని ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ అన్నారు. ప్రొ లీగ్ భారత రెజ్లింగ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ►భారత్‌లోని ఆరు నగరాల్లో మూడు వారాలపాటు ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహిస్తారు. ఉత్తర భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు.. పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భారత్ నుంచి ఒక్కో ఫ్రాంచైజీ ఉంటాయి. ►{పతి జట్టులో 11 మంది రెజ్లర్లు (పురుషులు-6, మహిళలు-5) ఉంటారు. ప్రతి జట్టులో ఆరుగురు భారత రెజ్లర్లు, ఐదుగురు విదేశీ రెజ్లర్లు ఉంటారు. ► మొత్తం లీగ్ ప్రైజ్‌మనీ రూ. 5 కోట్లు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్-20 మంది రెజ్లర్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు తమ అంగీకారాన్ని తెలిపారు. ► {పతి ఫ్రాంచైజీ కనీస ధర రూ. 3 కోట్లు. సె ప్టెంబరు 7లోపు ఆరు జట్లను ఖరారు చేస్తా రు. ఆగస్టు 30లోపు ఈ లీగ్ ప్రసారకర్తను ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15న రెజ్లర్ల వేలం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ లీగ్‌ను ప్రసారం చేస్తారు. ► మూడు వారాలు జరిగే ఈ లీగ్‌లో ప్రతి జట్టు అన్ని జట్లతో కనీసం ఒక్కసారైనా ఆడుతుంది. ‘బెస్ట్ ఆఫ్-9 బౌట్స్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఒక్కో బౌట్లో మూడు నిమిషాల నిడివిగల మూడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ మధ్య నిమిషం విరామం ఉంటుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. -
కోల్‌కతాపై షారుక్ ఆసక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ దృష్టి ఇప్పుడు ఫుట్‌బాల్‌పై పడింది. ఐఎంజీ-రిలయన్స్ ఆధ్వర్యంలో జరుగబోయే లీగ్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు షారుక్ ఆసక్తి చూపుతున్నాడు. ‘గతంలో గోవా ఐ లీగ్ క్లబ్ డెంపోలో వాటాలను తీసుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్రాంచైజీల ఆధారంగా లీగ్ రాబోతోంది. ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టి ఓ ఫ్రాంచైజీని తీసుకుందామని భావిస్తున్నాను. ముఖ్యంగా కోల్‌కతా ఫుట్‌బాల్ క్లబ్‌ను తీసుకుంటే ఇంకా బావుంటుంది’ అని షారుక్ తన మనసులో మాట బయటపెట్టాడు. ముంబైలో తొలి మ్యాచ్ ఐపీఎల్ తరహా ఫుట్‌బాల్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 18న జరిగే తొలి మ్యాచ్‌కు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఎనిమిది ఫ్రాంచైజీల వేలం, నవంబర్‌లో ఆటగాళ్ల వేలం జరుగనుంది. అన్ని ఫ్రాంచైజీలు క్లబ్స్గా రిజిష్టర్ అవుతాయి. జట్లను కొనుగోలు చేసిన వారు పదేళ్లు యజమానులుగా ఉంటారు. ప్రతీ జట్టులో పది మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి 22 మంది ఆటగాళ్లు ఉంటారు.