ఫైనల్‌లో విజేతలకు బహుమతుల ప్రదానం
సాక్షి, బెంగళూరు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ ముగింపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. బెంగళూరులోని సర్జ్ స్టేబుల్ సంస్థలో శనివారం సాయంత్రం ఈ అంతర్జాతీయ గుర్రపు స్వారీ ఫైనల్ పోటీలు జరిగాయి.
అనంతరం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. వివిధ దేశాల నుంచి ప్రపంచ స్థాయి గుర్రపు స్వారీ పోటీదారులు కూడా హాజరయ్యారు. ఈ సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ ద్వారా మనదేశ గుర్రపు స్వారీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లు అయిందని నిర్వాహకులు తెలిపారు.

గుర్రపు స్వారీ పోటీలను తిలకిస్తున్న వైఎస్ జగన్, కేటీఆర్

గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు బహుమతి అందజేస్తున్న వైఎస్ జగన్, కేటీఆర్

రేసులో గుర్రంపై దూసుకుపోతున్న పోటీదారు


