breaking news
equestrian
-
ఆశిష్ అద్భుతం
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంతో... ఆసియా ఈక్వె్రస్టియన్ (అశ్విక క్రీడలు) చాంపియన్‌షిప్‌లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయ్‌లాండ్‌లోని పటాయా నగరంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో మెరిసింది. ఈవెంటింగ్ కేటగిరీలో టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ (టీఏజీజీ) సభ్యుడైన ఆశిష్ లిమాయే స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఆసియా ఈక్వె్రస్టియన్ పోటీల చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆశిష్ లిమాయే, శశాంక్ సింగ్ కటారియా, శశాంక్ కనుమూరిలతో కూడిన భారత జట్టు ఈవెంటింగ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. డ్రెసాజ్ ఈవెంట్, ఇంటర్మీడియట్ ఫ్రీస్టయిల్–1 వ్యక్తిగత విభాగాల్లో శ్రుతి వోరా రజత పతకాలు నెగ్గింది. డ్రెసాజ్ టీమ్ విభాగంలో శ్రుతి వోరా, దివ్యకీర్తి సింగ్, గౌరవ్ పుందిర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం హస్తగతం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ 16 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు చేయూత పథకంలో భాగంగా భారత బృందంపై రూ. 2 కోట్ల 73 లక్షలు వెచ్చించారు. -
ఈక్వెస్ట్రియన్ లీగ్‌కు వైఎస్ జగన్, కేటీఆర్ హాజరు
సాక్షి, బెంగళూరు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ ముగింపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. బెంగళూరులోని సర్జ్ స్టేబుల్ సంస్థలో శనివారం సాయంత్రం ఈ అంతర్జాతీయ గుర్రపు స్వారీ ఫైనల్ పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. వివిధ దేశాల నుంచి ప్రపంచ స్థాయి గుర్రపు స్వారీ పోటీదారులు కూడా హాజరయ్యారు. ఈ సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ ద్వారా మనదేశ గుర్రపు స్వారీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లు అయిందని నిర్వాహకులు తెలిపారు.గుర్రపు స్వారీ పోటీలను తిలకిస్తున్న వైఎస్ జగన్, కేటీఆర్ గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు బహుమతి అందజేస్తున్న వైఎస్ జగన్, కేటీఆర్ రేసులో గుర్రంపై దూసుకుపోతున్న పోటీదారు -
‘బంగారు’ గుర్రానికి అనూశ్ బైబై
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో ఈక్వె్రస్టియన్ చాంపియన్ అనూశ్ అగర్వల్లా తనకు అచ్చొచ్చిన రేసుగుర్రానికి గుడ్‌బై చెప్పాడు. ‘మన్ని’ అని ముద్దుగా పిలుచుకునే గుర్రంతో ఏడేళ్ల బంధానికి భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. 2023లో హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో అనూశ్ పాలిట ‘మన్ని’ బంగారు గుర్రం అయ్యింది.ఈక్వె్రస్టియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్లో మన్నిపై స్వారీ చేసిన అనూశ్ స్వర్ణ పతకం సాధించాడు. ‘మన్ని’కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిoదని, ఇకపై ఆ రేసుగుర్రంతో బరిలోకి దిగబోనని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘నా తొలి అడుగులన్నీ మన్నితోనే వేశా. తొలి గ్రాండ్‌ప్రి, మొదటి అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి, అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానం... ఇలా చెప్పుకుంటూపోతే... పెద్ద పెద్ద అంతర్జాతీయ టోర్నీల్లో నా పోటీ ప్రదర్శనలకు రేసుగుర్రం నేను కన్న కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి ఓ గుర్రం, రైడర్ ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తన వేగంతో చాటి చెప్పింది’ అని భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. -
ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కు నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అశ్వక క్రీడల్లో (ఈక్వెస్ట్రియన్) భారత్‌కు నిరాశ తప్పలేదు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల డ్రెసాజ్ విభాగంలో రెండు పతకాలతో మెరిసిన అనూష్ అగర్వల్లా.. విశ్వక్రీడల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు. బుధవారం పురుషుల వ్యక్తిగత డ్రెసాజ్ ఈవెంట్ గ్రూప్ స్టేజ్‌లో అనూష్ 66.444 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గ్రూప్ ‘ఇ’లో పోటీపడిన 24 ఏళ్ల అనూష్ భారత్ నుంచి ఒలింపిక్స్ డ్రెసాజ్ విభాగంలో పాల్గొన్న తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హ్రిదయ్ చద్దా, అనుష్ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే (సెప్టెంబర్ 26) మూడు పతకాలు అందాయి. #EquestrianExcellence at the 🔝 After 41 long years, Team 🇮🇳 clinches🥇in Dressage Team Event at #AsianGames2022 Many congratulations to all the team members 🥳🥳#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/CpsuBkIEAw — SAI Media (@Media_SAI) September 26, 2023 భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం, ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. -
Tokyo Olympics: ఏడో స్థానంలో ఫౌద్ మీర్జా
టోక్యో: ఈక్వేస్ట్రియన్ (అశ్విక క్రీడ) తొలి రోజు భారత రైడర్ ఫౌద్ మీర్జా, అతడి అశ్వం ఆకట్టుకున్నాయి. శుక్రవారం జరిగిన డ్రెసెజ్ రౌండ్లో 28 పెనాల్టీలను స్కోర్ చేసిన ఫౌద్ 7వ స్థానంలో నిలిచాడు. 63 మంది రైడర్లలో 42 మంది తొలి రౌండ్‌ను పూర్తి చేయగా... మిగిలిన 21 మంది నేడు పూర్తి చేయనున్నారు. తొలి రౌండ్ పూర్తి చేసిన వారిలో తక్కువ పెనాల్టీలు (23.6) సాధించిన ఒలీవర్ (గ్రేట్ బ్రిటన్) తొలి స్థానంలో ఉన్నాడు. ఇది మూడు రౌండ్ల పాటు జరిగే ఈవెంట్. రెండో రౌండ్ క్రాస్ కంట్రీ కాగా... మూడోది షో జంపింగ్. ఇవి పూర్తయ్యాక అతితక్కువ పెనాల్టీలతో ఉన్న తొలి ముగ్గురికి స్వర్ణ, రజత, కాంస్యాలను బహూకరిస్తారు. అనిర్బన్ తడబాటు తొలి రౌండ్లో ఫర్వాలేదనిపించిన భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో మాత్రం తడబడ్డాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో 18 హోల్స్‌కు గాను 16 హోల్స్‌ను మాత్రమే అనిర్బన్ పూర్తి చేయగలిగాడు. ప్రస్తుతం అతడు 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత గోల్ఫర్ ఉదయన్ మానె 18 హోల్స్‌ను 69 షాట్లలో పూర్తి చేసి 57వ స్థానంలో ఉన్నాడు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 60 మంది పతకం రేసులో ఉన్నారు. -
ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు రెండు రజతాలు
ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా... టీమ్ విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేశ్, ఆశిష్, జితేందర్ సింగ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున పతకం నెగ్గిన ప్లేయర్‌గా ఫౌద్ మీర్జా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఈవెంట్లో మీర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. యొషియాకి (జపాన్–22.70 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. -
అతడు, ఆమె కలిసికట్టుగా...
రియో : టెన్నిస్, బ్యాడ్మింటన్, సెయిలింగ్‌లో పురుషుడు, మహిళ జోడీ కట్టే మిక్స్డ్ డబుల్స్ పోటీలను మనం చాలా చూశాం. అయితే ఒలింపిక్ క్రీడలలో ఈక్వెస్ట్రియన్ మాత్రం అన్నింటికంటే స్పెషల్. పురుషులు, మహిళలు కలిసి ఆడే ఏకైక క్రీడ ఇది. టీం ఈవెంట్లోనే కాకుండా వ్యక్తిగత విభాగంలోనూ వీరు ప్రత్యర్థులుగా పోటీ పడవచ్చు. ఇదే విశేషం అంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న న్యూజిలాండ్ జట్టులో మరో ఆసక్తిర అంశమూ ఉంది. ఈ టీమ్ సభ్యులు టిమ్ ప్రైస్, జోనెల్ ప్రైస్ భార్యా భర్తలు. రెండేళ్ల క్రితమే ప్రపంచ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన తొలి దంపతులుగా రికార్డు సృష్టించిన వీరు తొలి సారి ఒలింపిక్ బరిలో కలిసి ఆడబోతున్నారు. ఈ ఘనత సాధించిన తొలి జంట టిమ్, జోనెల్ కావడం విశేషం. వీరిలో జోనెల్ 2012 లండన్ ఒలింపిక్స్ టీమ్ ఈవెంట్లో కాంస్యం కూడా గెలుచుకుంది.


