అతడు, ఆమె కలిసికట్టుగా... | A stray bullet in the Olympic equestrian venue is a bit ... alarming | Sakshi
Sakshi News home page

అతడు, ఆమె కలిసికట్టుగా...

Aug 8 2016 2:09 AM | Updated on Sep 4 2017 8:17 AM

అతడు, ఆమె కలిసికట్టుగా...

అతడు, ఆమె కలిసికట్టుగా...

టెన్నిస్, బ్యాడ్మింటన్, సెయిలింగ్‌లో పురుషుడు, మహిళ జోడీ కట్టే మిక్స్‌డ్ డబుల్స్ పోటీలను మనం చాలా చూశాం.

రియో : టెన్నిస్, బ్యాడ్మింటన్, సెయిలింగ్‌లో పురుషుడు, మహిళ జోడీ కట్టే మిక్స్‌డ్ డబుల్స్ పోటీలను మనం చాలా చూశాం. అయితే ఒలింపిక్ క్రీడలలో ఈక్వెస్ట్రియన్ మాత్రం అన్నింటికంటే స్పెషల్. పురుషులు, మహిళలు కలిసి ఆడే ఏకైక క్రీడ ఇది. టీం ఈవెంట్‌లోనే కాకుండా వ్యక్తిగత విభాగంలోనూ వీరు ప్రత్యర్థులుగా పోటీ పడవచ్చు. ఇదే విశేషం అంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న న్యూజిలాండ్ జట్టులో మరో ఆసక్తిర అంశమూ ఉంది.

ఈ టీమ్ సభ్యులు టిమ్ ప్రైస్, జోనెల్ ప్రైస్ భార్యా భర్తలు. రెండేళ్ల క్రితమే ప్రపంచ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన తొలి దంపతులుగా రికార్డు సృష్టించిన వీరు తొలి సారి ఒలింపిక్ బరిలో కలిసి ఆడబోతున్నారు. ఈ ఘనత సాధించిన తొలి జంట టిమ్, జోనెల్ కావడం విశేషం. వీరిలో జోనెల్ 2012 లండన్ ఒలింపిక్స్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం కూడా గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement