టీడీపీ కీచక కాండ: మహిళల దుస్తులు చించేసి.. | TDP Workers Accused of Attacking YSRCP Women Candidates in Tirupati | Sakshi
Sakshi News home page

టీడీపీ కీచక కాండ: మహిళల దుస్తులు చించేసి..

Oct 17 2026 12:53 PM | Updated on Oct 17 2026 1:13 PM

TDP Workers Accused of Attacking YSRCP Women Candidates in Tirupati

సాక్షి, తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ.. టీడీపీ గూండాలు మరో అడుగు ముందుకేశారు. బరితెగించి వైఎ‍స్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను, వాళ్ల వెంట ఉన్న మహిళలను అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో కొందరి దుస్తులు చించేశారు.

ఎమ్మార్పల్లిలోని 12వ వార్డుకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మవితపై దాడి జరిగింది. అలాగే 15వ వార్డు కార్యాలయం సమీపంలో స్వర్ణ, పావనిలపై కూడా దాడి జరిగింది. మహిళా అభ్యర్థులను నడిరోడ్డుపై అడ్డుకుని పిడిగుద్దులు గుప్పించారు టీడీపీ గూండాలు. ఈ క్రమంలో వాళ్ల దుస్తులు చించేశారు. జరిగిన దాడిని వివరిస్తూ మహిళా అభ్యర్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా.. రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నాయి. దాడుల భయంతో నిన్నటి నుంచి వందలాది ఫిర్యాదులు అందించినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని తెలుస్తోంది.

తిరుపతిలో ఉద్రిక్తత
నామినేషన్ల సందర్భంగా మహిళా అభ్యర్థులపై దాడి జరిగిందన్న ఆరోపణలు తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement