ఆఖరి మ్యాచ్‌లో అదుర్స్‌.. సిరీస్‌ సమం | Rani, Gurjit lead India to series levelling win over Spain | Sakshi
Sakshi News home page

ఆఖరి మ్యాచ్‌లో అదుర్స్‌.. సిరీస్‌ సమం

Jun 19 2018 1:17 PM | Updated on Jun 19 2018 1:17 PM

Rani, Gurjit lead India to series levelling win over Spain - Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌తో ఐదు మ్యాచ్‌లో హాకీ సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ సమష్టిగా రాణించి 4-1 తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌ 2-2తో సమం అయ్యింది.

సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భారత మహిళలు అత్యంత దూకుడుగా ఆడారు. మ్యాచ్‌ 33, 37 నిమిషాల్లో భారత క్రీడాకారిణి రాణి రాంపాల్‌ రెండు గోల్స్‌తో జట్టును ఆధిక్యంలో నిలపగా, గుర్జిత్‌(44, 50 నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్స్‌ను గోల్‌గా మలచి మరింత ముందంజలోకి తీసుకెళ్లింది. కాగా, ఆట 58వ నిమిషంలో లోలా రేరా గోల్‌ మాత్రమే సాధించడంతో స్పెయిన్‌కు ఓటమి తప‍్పలేదు. తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ గెలవగా, రెండో మ్యాచ్‌ డ‍్రా అయ్యింది. ఇక మూడో మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందగా, నాల్గో మ్యాచ్‌లో స్పెయిన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement