
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది.
భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్‌జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్‌లో జరుగనుంది.