తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. గ్రీన్ ఫీల్డ్ మైదానంలో కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది హిట్టింగ్ ఒక్కటే అన్నట్లగా కిషన్ ఇన్నింగ్స్ కొనసాగింది.
ఈ క్రమంలో కిషన్ కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు ప్రత్యర్ధి ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు.
అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


