breaking news
venkateshwara swami darshanam
-
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల
-
మే 3వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
సాక్షి, తిరుమల : లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో మే 3వ తేది వరకూ భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు యథాతథంగా నిర్వహిస్తామని, సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోని పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. టీటీడీ చైర్మన్ అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ ద్వారా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కలెక్టర్కు ఈ నిధులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటామని, అవసరం అయితే మరిన్ని నిధులు విరాళంగా అందజేస్తామని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్
తిరుమల: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. శనివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల అఖిలాండం వద్ద ఆయన సతీమణి కార్తిక దీపం వెలిగించి కొబ్బరికాయకొట్టి మొక్కు చెల్లించుకున్నారు.