మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.
తిరుమల: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. శనివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
ఆలయం వెలుపల అఖిలాండం వద్ద ఆయన సతీమణి కార్తిక దీపం వెలిగించి కొబ్బరికాయకొట్టి మొక్కు చెల్లించుకున్నారు.