తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి మాసం విశేష తేదీలను వెల్లడించింది.
- జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం
- జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర
- జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
- జనవరి 14న భోగి.
- జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
- జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
- జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
- జనవరి 23న వసంత పంచమి.
- జనవరి 25న రథ సప్తమి


