తిరుమల: గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా గత నెల 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ గతేడాదిగా ప్రతిరోజూ 4 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది.
ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు (బఫర్) భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అలాగే, 2024తో పోల్చితే 10% అధికంగా లడ్డూలను విక్రయించినట్లు పేర్కొంది. 2024లో 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా 2025లో 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ విక్రయించినట్లు తెలిపింది.


