మే 3వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

Venkateshwara swamy Darshan at Tirumala suspended till May 3 - Sakshi

సాక్షి, తిరుమల : లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో మే 3వ తేది వరకూ భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు యథాతథంగా నిర్వహిస్తామని, సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోని పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.  టీటీడీ చైర్మన్ అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ ద్వారా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి  జిల్లా కలెక్టర్‌కు ఈ నిధులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటామని, అవసరం అయితే మరిన్ని నిధులు విరాళంగా అందజేస్తామని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top