కేరళలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి | Heavy rains in Kerala Five dead | Sakshi
Sakshi News home page

కేరళలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

Sep 21 2026 7:44 PM | Updated on Sep 21 2026 8:01 PM

Heavy rains in Kerala Five dead

కేరళని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో పాటు ఇతర కారణాలతో ఐదుగురు మృతిచెందారు. పెద్దఎత్తున వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది.  పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం, ఇడుక్కి మరియు త్రిస్సూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నిన్న (ఆదివారం) ఉదయం ఇడుక్కి, మలప్పురం సహా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదల వంటి వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

మరోవైపు నార్త్‌ ఇండియాలోనూ వర్షం బీభత్సం సృష్టింస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉన్నావ్‌లోని మురికివాడల్లో భారీగా నీరు చేరడంతో పడవలతో సహాయక చర్యలు చేపడుతున్నారు.  గుజరాత్‌లోని భావ్‌నగర్ రాజ్‌కోట్‌లో ఆదివారం అరగంట పాటు కురిసిన భారీ వర్షానికే  రహదారులు నీటితో నిండిపోయాయి. భావ్‌నగర్‌లోని మహువా రాజ్‌కోట్‌లోని గోండల్‌లో 4.5 అంగుళాల వర్షపాతం నమోదు కాగా, రాజ్‌కోట్‌లోని గోండల్‌లో 3.5 అంగుళాల వర్షపాతం నమోదైంది.

జునాగఢ్‌లోని గిర్నార్ అడవిలో ఆకస్మిక వరద సంభవించింది. ఆత్మేశ్వర మహాదేవ్ ఆలయానికి వెళ్తున్న పిల్లలు, వృద్ధులతో సహా 40 మందికి పైగా భక్తులు చిక్కుకుపోయారు. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది భక్తులను రక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement