బలహీనమైన యూరప్‌ అమెరికాకు అనవసరం | Jamie Dimon CEO of JPMorgan warned that Europe faces real problem | Sakshi
Sakshi News home page

బలహీనమైన యూరప్‌ అమెరికాకు అనవసరం

Dec 9 2025 5:52 PM | Updated on Dec 9 2025 6:07 PM

Jamie Dimon CEO of JPMorgan warned that Europe faces real problem

అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ అండ్‌ చేజ్ సీఈఓ జామీ డిమోన్ ఇటీవల రీగన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్‌ అధికార యంత్రాంగం, ఆర్థిక విచ్ఛిన్నం అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు. డిమోన్ ఈ సందర్భంగా యూరప్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు.

‘యూరప్‌లో సమస్య ఉంది. వారు వ్యాపారాన్ని, పెట్టుబడులను, ఆవిష్కరణలను బయటకు పంపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఆ ప్రాంతం స్థిరత్వానికి ప్రమాదం. యూరప్‌ బలహీనపడటం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరప్‌ విచ్ఛిన్నమైతే ‘అమెరికా ఫస్ట్’ ఇకపై సాధ్యం కాదు. బలహీనమైన యూరప్‌ అమెరికాకు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు.

జేపీ మోర్గాన్ భారీ పెట్టుబడి

ఈ హెచ్చరికల నేపథ్యంలో జేపీ మోర్గాన్ సంస్థ అమెరికా ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ఇటీవల ప్రకటించింది. ఇది గత ప్రణాళిక కంటే 500 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ పెట్టుబడులు ప్రధానంగా కొన్ని కీలక రంగాలపై దృష్టి పెట్టేందుకు తోడ్పడుతాయని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement