breaking news
real problem
-
బలహీనమైన యూరప్ అమెరికాకు అనవసరం
అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ అండ్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ ఇటీవల రీగన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ అధికార యంత్రాంగం, ఆర్థిక విచ్ఛిన్నం అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు. డిమోన్ ఈ సందర్భంగా యూరప్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు.‘యూరప్‌లో సమస్య ఉంది. వారు వ్యాపారాన్ని, పెట్టుబడులను, ఆవిష్కరణలను బయటకు పంపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఆ ప్రాంతం స్థిరత్వానికి ప్రమాదం. యూరప్ బలహీనపడటం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరప్ విచ్ఛిన్నమైతే ‘అమెరికా ఫస్ట్’ ఇకపై సాధ్యం కాదు. బలహీనమైన యూరప్ అమెరికాకు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు.జేపీ మోర్గాన్ భారీ పెట్టుబడిఈ హెచ్చరికల నేపథ్యంలో జేపీ మోర్గాన్ సంస్థ అమెరికా ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ఇటీవల ప్రకటించింది. ఇది గత ప్రణాళిక కంటే 500 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ పెట్టుబడులు ప్రధానంగా కొన్ని కీలక రంగాలపై దృష్టి పెట్టేందుకు తోడ్పడుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
వాస్తవిక సమస్యతో...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఒక వాస్తవిక సమస్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘చోరీ’. ప్రీతమ్, మధులగ్న దాస్, దీపాలి జంటగా మై టీమ్ వర్క్ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో అల్లాడి శకుంతల, కనాల నారపరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శక-నిర్మాత రాజ్ కందుకూరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేయడంతో పాటు సంగీతం అందించాను. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చర్చించాం. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మిగిలిన టాకీ ఈ నెలలోనే పూర్తి చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ చిన్నప్పటి నుంచి హీరో కావాలనే నా కల ఈ చిత్రంతో తీరింది’’ అని ప్రీతమ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల.


