వాస్తవిక సమస్యతో...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఒక వాస్తవిక సమస్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఒక వాస్తవిక సమస్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘చోరీ’. ప్రీతమ్, మధులగ్న దాస్, దీపాలి జంటగా మై టీమ్ వర్క్ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో అల్లాడి శకుంతల, కనాల నారపరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శక-నిర్మాత రాజ్ కందుకూరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేయడంతో పాటు సంగీతం అందించాను. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చర్చించాం. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మిగిలిన టాకీ ఈ నెలలోనే పూర్తి చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ చిన్నప్పటి నుంచి హీరో కావాలనే నా కల ఈ చిత్రంతో తీరింది’’ అని ప్రీతమ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల.


