సాక్షి, హైదరాబాద్: కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో కాలి చిన్నారి మృతి చెందింది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కవల పిల్లల్లో రహీం మృతిచెందగా.. రెహమాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


