సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో ఇద్దరు పిల్లలతో పాటు నలుగురు పెద్దవారు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు.
ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రోబో ఫైర్ మిషన్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న సీపిీ సజ్జనార్ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు.




