సాక్షి, అనకాపల్లి: అచ్చుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలడంతో కార్మికులు పరుగలు తీశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపు చేశారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎస్వీఎస్ ఫార్మా ప్రమాద సమయంలో బీ-షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు ఉన్నారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని ఫార్మా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తొలిత మంటలు వ్యాపించి.. రియాక్టర్ పేలినట్టు సమాచారం.


