గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్‌ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్‌లో సహా యజమానిగా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్‌ను కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిన్న మరో క్లబ్‌ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగిన క్లబ్‌కు కో పార్టనర్‌గా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్ పార్టనర్ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే క్లబ్ యజమానులు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరూ థాయ్‌లాండ్ పారిపోయారు. దీంతో వారిద్దరిపై పోలీసులు లూకౌట్ నోటీలుసు ఇష్యూ చేయగా, ఇంటర్నేషనల్ ఏజేన్సీ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బ్లూకార్నర్ నోటీసులు జారీ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుందని కానీ ఈ ప్రమాద ఘటన తీవ్రత నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు తక్షణమే స్పందించి కేవలం రెండు రోజుల్లో బ్లూకార్నర్ నోటీసులు వచ్చేలా కృషి చేశాయని గోవా పోలీసు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న లూథ్రాబ్రదర్స్‌ను పట్టుకోవడానకి గోవాకు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం థాయ్‌లాండ్‌కు వెళ్లాయని పేర్కొన్నారు. గోవా ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని దానికోసం సీబీఐతోపాటు ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లూథ్రా బ్రదర్స్‌కు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్ ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.
ఈ శనివారం అర్థరాత్రి బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఆ క్లబ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తేలింది. నైట్ క్లబ్‌కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేక పోయిందని అధికారులు తెలిపారు. దానితో పాటు క్లబ్ నిర్మాణం తాటాకులతో చేపట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు.


