భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు భారీ పోలీసు వహారా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌కు విదేశీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు.
దీనికి గాను కింది స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు బందోబస్తు మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్క అధికారి ఈ సమ్మిట్‌కలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమ్మిట్‌లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్‌ను ఎస్టాబ్లిష్ చేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల ద్వారా ప్రతి సెకను కదలికలను గమనిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం టూ ఫ్యూచర్ సిటీ
ఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం పోలీసు శాఖ నెల రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫ్యూచర్ సిటీలోనే మకాం వేసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్నటి రోజు సదస్సులో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా వీరిలో పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాన వచ్చారు. అలా వచ్చిన ప్రతినిధులు, ప్రముఖుల కోసం రహదారి వెంట వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు బాంబు స్వార్డ్, డాగ్ స్క్వాడ్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహించారు.
ఆకట్టుకున్న పోలీసు స్టాల్
సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ విదేశీయులను తదితరులను ఆకట్టుకున్నది. తెలంగాణ పోలీసు శాఖ తరపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఆంగ్లంలోవున్న ఈ కరపత్రాలు అందరికీ ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. అలాగే సమ్మిట్ ప్రాంతంలో రోడ్డు మార్గంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు కలియతిరిగుతూ వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్ లేనివారికి అవగాహన కల్పించారు.


