బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విద్వేశజ్వాలలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నసంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి హింస చెలరేగింది. అక్కడి మత ఛాందసవాదులు సిల్హట్ జిల్లాలో హిందూ కుటుంబం ఉన్న ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఇది గమనించిన ఆ కుటుంబ సభ్యులు హుటాహుటీన అక్కడి నుండి పరుగు తీశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస తీవ్రరూపం దాలుస్తుంది. షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు ఏదో రకంగా అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కడి విద్యార్థినేత ఉస్మాన్ సౌదీ మరణంతో అక్కడి మైనార్టీలపై దాడులు మరోసారి తీవ్రతరమయ్యాయి. అప్పట్నుంచి దాదాపు 42 ఘటనలు జరుగగా దాదాపు 12మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అక్కడి దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బంగ్లా ప్రభుత్వం స్పందించడం లేదు.
తాజాగా మరోసారి ఆ దేశంలో మత విద్వేశం చెలరేగింది. బంగ్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓ హిందూ ఇంటికి అక్కడి అల్లరిమూకలు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిల్హాట్ జిల్లా గోవైన్ ఘాట్ ఉపజిల్లా నందిర్‌గ్రామంలో బీరేంద్రకుమార్ అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి అక్కడి మతఛాందస వాదులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన ఇంటిసభ్యులు హుటాహుటీన అక్కడి నుండి ఇంటినుండి పరుగులుతీశారు. ఈవీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇస్లామిక్ గ్రూపులే ఈ దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఒక హిందువ్యక్తిని అక్కడి దుండగులు నరికి చంపగా, అక్కడి జగత్‌పూర్ అనే గ్రామంలోని పంటపొలాల్లో 27ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. బంగ్లాదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఘటనలు అక్కడి మైనార్టీలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
UNENDING XENOPHOBIA THE WORLD WATCHES SILENTLY
Another targeted attack on a Hindu family in Bangladesh. The home of teacher Birendra Kumar Dey (“Jhunu Sir”) in Sylhet’s Gowainghat was set on fire again. pic.twitter.com/injFKFqMkZ— Rahul Shivshankar (@RShivshankar) January 16, 2026


