హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) రాత్రి ఇస్లామియా హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్‌ప్రైజస్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దీనిపై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీనా అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. పక్క షాపులకు సైతం మంటలు వ్యాపించాయి. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియరాలేదు.


