ఫుల్‌ జోష్‌.. నుమాయిష్‌ హౌస్‌ఫుల్‌, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?

Hyderabad: Numaish Exhibition Visitors Crosses 4 Lakh Visiting In Nampally - Sakshi

గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్‌) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్‌ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్‌ కమిటీ ఛైర్మన్‌ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు.

ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు దారిమళ్లించారు.

చదవండి: వందేభారత్‌లో త్వరలో స్లీపర్‌ బెర్తులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top