ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి

ABVP Darna Over Poor Pass Percentage Disrupts Junior Colleges - Sakshi

ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళనలు

నాంపల్లి: ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు.  ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌  చేశారు.

ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top