సీఎం కేసీఆర్‌కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ

Nampally Exhibition Society Former Secretary Ravindra Sena Letter To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ తనిఖీలు నేపథ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)కు లాల్‌బహదూర్‌శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ రాశారు. రెండేళ్ల క్రితమే ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజ్‌ ముగిసినా అక్రమంగా కార్యకలాపాలు సాగించినట్లు లేఖలో పేర్కొన్నారు.

సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా 62 మందికి మెంబర్‌షిప్‌లు ఇచ్చారన్నారు. గత మూడేళ్లలో కొత్తగా మెంబర్‌షిప్‌ పొందినవారిని సస్పెండ్‌ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆడిట్‌ సక్రమంగా జరగలేదని తెలిపారు. కాలేజీ నిధులను సైతం మళ్లించారని.. ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ లేఖలో రవీంద్రసేన పేర్కొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top