ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం దుర్మార్గం

Telangana: YS Sharmila Protests At TSPSC Office Demanding Jobs - Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌) : రాష్ట్రంలో ఉద్యోగ నోటి ఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండి పడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. షర్మిల మాట్లాడుతూ యువత, విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు.

ఉపాధి అవకాశాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే 1.90 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఆమెను బేగంబజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top