కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా | Nampally Court Adjourned Nagarjuna Defamation Case Petition Against Konda Surekha | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా

Oct 4 2024 2:01 PM | Updated on Oct 4 2024 3:05 PM

Nampally Court Adjourned Nagarjuna Petition

టాలీవుడ్‌  ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై  తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్‌

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు.  అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్‌ అయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement