నాంపల్లి ప్రమాదంపై రేవంత్‌ దిగ్భ్రాంతి.. సర్కార్‌పై ఫైర్‌ | Revanth Reddy Key Comments Over Nampally Fire Accident In Chemical Godown In A Apartment - Sakshi
Sakshi News home page

Nampally Fire Accident: అగ్ని ప్రమాదాలకు అడ్డగా హైదరాబాద్‌.. రేవంత్‌ సీరియస్‌ కామెంట్స్‌

Nov 13 2023 12:24 PM | Updated on Nov 14 2023 11:13 AM

Revanth Reddy Key Comments Over Nampally Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అ‍గ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. 

ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement