Hyd: అడ్వాన్స్‌డ్ ఫిజియో అండ్‌ రీజెనరేటివ్ సెంటర్ ప్రారంభం | Advanced Physio and Regenerative Center In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: అడ్వాన్స్‌డ్ ఫిజియో అండ్‌ రీజెనరేటివ్ సెంటర్ ప్రారంభం

Mar 14 2026 6:37 PM | Updated on Mar 14 2026 7:10 PM

Advanced Physio and Regenerative Center In Hyderabad

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓఘా హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ అండ్ రీజెనరేటివ్ సెంటర్‌ను ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నానుడిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. రోగాలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన చికిత్స, సంరక్షణ పొందడం ఎంతో అవసరమని తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి లైఫ్ స్టైల్ మార్పులు ఆరోగ్యానికి కీలకం అని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ చికిత్సలు అందించే ఈ కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా మహిళలు తరచూ ఎదుర్కొనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణకు ఒలింపిక్ పతకాలు సాధించిన ఈషా సింగ్ వంటి యువ మహిళా క్రీడాకారులు ఈ తరం అమ్మాయిలకు ఆదర్శమని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, బిగ్ బాస్ ఫేమ్ భరణితో పాటు పలువురు పేజ్-3 ప్రముఖులు పాల్గొన్నారు.

ఓజిహెచ్‌ఏ హెల్త్ (OGHA Health) ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అడ్వాన్స్‌డ్ ఫిజియో & రీజెనరేటివ్ సెంటర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిజియోథెరపీ, రీజెనరేటివ్ కేర్ మరియు రిహాబిలిటేషన్ సేవలను అందిస్తూ, శరీర చలనం మెరుగుపరచడం, నొప్పి తగ్గించడం మరియు మొత్తం శారీరక పనితీరును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కేంద్రాన్ని ముఖ్య అతిథి శైలజా రామయ్యర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఒలింపిక్ స్పోర్ట్ షూటర్ ఈషా సింగ్, డెలాయిట్ సంస్థ చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరిరంగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓజిహెచ్‌ఏ హెల్త్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ డా. సంధ్య గోలి మాట్లాడుతూ, ఆధునిక వైద్యం కేవలం వ్యాధులను చికిత్స చేయడానికే పరిమితం కాకుండా, వ్యక్తులలో శక్తి, చలనం మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement