breaking news
physiotheraphy services
-
Hyd: అడ్వాన్స్డ్ ఫిజియో అండ్ రీజెనరేటివ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓఘా హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీజెనరేటివ్ సెంటర్ను ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నానుడిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. రోగాలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన చికిత్స, సంరక్షణ పొందడం ఎంతో అవసరమని తెలిపారు.ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి లైఫ్ స్టైల్ మార్పులు ఆరోగ్యానికి కీలకం అని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ చికిత్సలు అందించే ఈ కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా మహిళలు తరచూ ఎదుర్కొనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణకు ఒలింపిక్ పతకాలు సాధించిన ఈషా సింగ్ వంటి యువ మహిళా క్రీడాకారులు ఈ తరం అమ్మాయిలకు ఆదర్శమని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, బిగ్ బాస్ ఫేమ్ భరణితో పాటు పలువురు పేజ్-3 ప్రముఖులు పాల్గొన్నారు.ఓజిహెచ్ఏ హెల్త్ (OGHA Health) ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అడ్వాన్స్డ్ ఫిజియో & రీజెనరేటివ్ సెంటర్ ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిజియోథెరపీ, రీజెనరేటివ్ కేర్ మరియు రిహాబిలిటేషన్ సేవలను అందిస్తూ, శరీర చలనం మెరుగుపరచడం, నొప్పి తగ్గించడం మరియు మొత్తం శారీరక పనితీరును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కేంద్రాన్ని ముఖ్య అతిథి శైలజా రామయ్యర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఒలింపిక్ స్పోర్ట్ షూటర్ ఈషా సింగ్, డెలాయిట్ సంస్థ చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరిరంగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓజిహెచ్ఏ హెల్త్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ డా. సంధ్య గోలి మాట్లాడుతూ, ఆధునిక వైద్యం కేవలం వ్యాధులను చికిత్స చేయడానికే పరిమితం కాకుండా, వ్యక్తులలో శక్తి, చలనం మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. -
విలీన విద్య.. వికలాంగులకు వరం
పేట ఐఈడీ కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు పెద్దశంకరంపేట: విలీన విద్య.. వికలాంగ విద్యార్థుల పాలిట వరంగా మారింది. మూడేళ్ల క్రితం పేట మానవ వనరుల కేంద్రం ఆవరణలో నూతనంగా ఐఈడీ కేంద్రాన్ని నిర్మించారు. మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 80 మందికి పైగా వికలాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మానసిక వికలాంగ విద్యార్థులు కూడా ఉన్నారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వినికిడి లోపం, బుద్ధిమాంద్యం, బహుళ వైకల్యం తదితర లోపాల విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇద్దరు ఐఈడీ ఉపాధ్యాయులను కూడా నియమించారు. ఆయా పాఠశాలల నుంచి వచ్చే వికలాంగ విద్యార్థులకు చదువుతో పాటు ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనాన్ని కూడా సమకూరుస్తున్నారు. వీరు పాఠశాలకు వచ్చేందుకు ప్రతి నెల రవాణా భత్యాన్ని చెల్లిస్తున్నారు. ఈ విధానంపై గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆర్వీయం ద్వారా విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం వికలాంగల పరిరక్షణ చట్టాన్ని రూపొందించి సంక్షేమ పథకాలు, అన్ని రకాలా ఉచిత సేవలందిస్తోంది. క్రీడా పరికరాలను కూడా మంజూరు చేసింది. దీంతో మానిసక, శారీరక వికలాంగ విద్యార్థులకు విలీన విద్య ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గతంలో కూడా మండల స్థాయిలో విద్యార్థులకు కంటి, చెవి తదితర సంబంధిత పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ కేంద్రం ద్వారా వికలాంగులు, మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తుండడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.


