చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం | Missing Children Mystery Ends in Tragedy Kamareddy | Sakshi
Sakshi News home page

చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం

Mar 14 2026 6:51 PM | Updated on Mar 14 2026 7:16 PM

Missing Children Mystery Ends in Tragedy Kamareddy

కామారెడ్డి:  గోసంగి కాలనీలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతమైంది. పట్టణంలోని రాజానగర్‌ కాలనీలోని ఒక బావిలో ఆ ఇద్దరు చిన్నారులు శవాలై తేలారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లారు విజయ్‌(10), సింహాద్రి(9) అనే ఇద్దరు చిన్నారులు. అప్పటి నుంచి చిన్నారుల ఆచూకీ లభించలేదు. 

దాంతో చిన్నారుల మిస్సింగ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తొమ్మిదిరోజులుగా చిన్నారుల కోసం ఆశగా ఎదురు చూశారు కుటుంబ సభ్యులు. చివరికి కుంటలో విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement